Kidneys Health | మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతూనే ఉంటాయి. ఈ క్రమంలో మనం నిద్రపోయినా కూడా కిడ్నీలు పనిచేస్తూనే ఉంటాయి. అందుకనే ఉదయం నిద్ర లేవగానే మనం మల మూత్రాలను విసర్జించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర కారణాల వల్ల చాలా మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందికి కిడ్నీలు పాడవడమో లేదా కిడ్నీ స్టోన్స్ రావడమో జరుగుతోంది. అయితే రోజూ ఉదయం పలు జాగ్రత్తలను పాటిస్తే చాలు.. దాంతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉదయం కొన్ని అలవాట్లను పాటిస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. ఇలా తాగడం మంచిది కాదు. దీంతో శరీరంపై భారం పడుతుంది. ముఖ్యంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. అలా కాకుండా ఈ పానీయాలకు బదులుగా గోరు వెచ్చని నీటిని ఒక లీటర్ మోతాదులో తాగాలి. దీంతో కిడ్నీల్లోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. కిడ్నీలపై భారం పడకుండా ఉంటుంది. రోజంతా కిడ్నీలు ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేస్తాయి. వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. అదేవిధంగా రోజూ వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. దీంతో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కిడ్నీలకు మేలు చేసే ఆహారాలను తినడం వల్ల కూడా కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా బెర్రీలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఉదయం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కిడ్నీల పనితీరును మెరుగు పరుస్తాయి. కిడ్నీల వాపులు తగ్గేలా చేస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలను తీసుకోవాలి. ఇవి కిడ్నీలలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోయేలా చేస్తాయి. దీంతో కిడ్నీలకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
హెర్బల్ టీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. హెర్బల్ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోయేలా చేస్తాయి. దీంతో కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే షుగర్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే కిడ్నీలపై భారం పడుతుంది. పదే పదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి. దీర్ఘకాలంలో ఇలా జరిగితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కనుక షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇలా కొన్ని చిట్కాలను, జాగ్రత్తలను పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీల పనితీరు మెరుగు పడడమే కాక, కిడ్నీ స్టోన్లు కూడా రాకుండా అడ్డుకోవచ్చు.