Depression | ఒత్తిడి, ఆందోళన అనేవి నేటి తరం యువతలో సహజం అయిపోయాయి. చాలా మంది ఉద్యోగులు కూడా వీటి బారిన పడుతున్నారు. పని ఒత్తిడితోపాటు ఆర్థిక, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఇంకా ఒత్తిడి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. దీర్ఘకాలంలో ఒత్తిడి తీవ్రమైన మానసిక సమస్యగా మారుతుంది. ఇది డిప్రెషన్ కు దారి తీస్తుంది. డిప్రెషన్లో ఉన్నవారిని అంత సులభంగా గుర్తించలేరు. అయితే డిప్రెషన్లో ఉన్నవారిని సరైన సమయంలో గుర్తిస్తే వారు ఆత్మహత్య వంటి విపరీత ఆలోచన చేయకుండా కాపాడవచ్చు. డిప్రెషన్లో ఉన్నవారికి కచ్చితంగా మానసిక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందించాలి. దీంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేయాలి. ఇలా చేస్తే త్వరగా కోలుకుని మామూలు మనుషులు అవుతారు.
డిప్రెషన్లో ఉన్నవారు కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డ్యాన్స్, యోగా వంటివి చేస్తుండాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. రోజూ కచ్చితంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది మెదడుపై పాజిటివ్ ఎఫెక్ట్‌ను కలిగిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, వాల్ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక సమస్యలు తగ్గేలా చేస్తాయి. రాత్రి పూట నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి. సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు కలిగిన తృణ ధాన్యాల లేదా చిరు ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడతారు.
తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మెదడుపై పాజిటివ్ ప్రభావాన్ని చూపి డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తాయి. అమైనో యాసిడ్లు ఉండే పప్పు దినుసులు, మాంసం వంటి ఆహారాలను తినడం వల్ల కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుంది. రోజువారి ఆహారంలో పెరుగును తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్, తీపి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్‌ను తినడం మానేయాలి. నీళ్లను తగిన మోతాదులో రోజూ తాగాలి. ఈ సూచనలు పాటిస్తే డిప్రెషన్ నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.
రాత్రి పూట పాలలో కాస్త అశ్వగంధ పొడిని కలిపి తాగుతుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. రిలాక్స్ అవుతారు. నిద్ర పట్టడమే కాదు, డిప్రెషన్ నుంచి కూడా బయట పడతారు. అలాగే పాలలో కుంకుమ పువ్వును కలిపి తాగుతున్నా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మన మూడ్‌ను మారుస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడేస్తాయి. మానసిక ప్రశాంతతను అందించి డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. అలాగే అరటి పండును ఆహారంలో బాగం చేసుకుంటున్నా కూడా డిప్రెషన్ నుంచి బయట పడతారు. ఈ పండ్లను తింటే సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. కనుక డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తుంది. ఇలా కొన్ని రకాల సూచనలు, చిట్కాలను పాటిస్తే డిప్రెషన్‌ను తగ్గించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు.