న్యూఢిల్లీ : శీతాకాలంలో చలి వణికిస్తుండగా ప్రతి ఒక్కరూ పొగలు కక్కే ఆహార పదార్ధాలు తీసుకోవడంతో పాటు వేడి పానీయాలు (Winter Soups) తాగేందుకు మొగ్గుచూపుతుంటారు. గరం ఛాయ్ నుంచి వేడివేడి కాఫీలు, సూప్‌ల వరకూ వెచ్చగా గొంతు తడుపుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
ఇక తాజా కూరగాయలతో ఇతర స్పైసీ నాన్ వెజ్ రెసిపీలతో కూడిన సూప్‌లను కూడా పలువురు ఇస్టపడుతుంటారు. ఈ హాట్ సూప్‌లు రుచిగా ఉండటంతో పాటు శరీరాన్ని వేడిగా ఉంచడంలోనూ సహకరిస్తాయి. వింటర్లో పలు హాట్ సూప్‌లను ప్రతిఒక్కరూ వారి వ్యక్తిగత రుచులకు అనుగుణంగా భిన్న రుచులను ఆస్వాదించవచ్చు.
ముఖ్యంగా ప్రొటీన్ ప్యాక్డ్ దాల్ పాలక్ సూప్ ఆరోగ్యానికీ అద్భుతమైన సూప్‌గా చెప్పుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే పాలకూరతో పాటు ప్రొటీన్ పవర్‌హౌస్ పప్పులను మేళవించే ఈ సూప్‌ను వింటర్లో ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ సీజన్లో గరంగరం టమాటా సూప్, కార్న్ సూప్, చికెన్ సూప్, మూంగ్‌దాల్ సూప్‌లను ఆస్వాదించవచ్చు.
Read More :