మెల్బోర్న్ : ప్రముఖ ఆస్ట్రేలియన్ కుక్, మాస్టర్ చెఫ్, గాడ్‌ఫాదర్ ఆఫ్ అవకడో టోస్ట్‌గా (Food Pioneer) పేరొందిన బిల్ గ్రాంజర్ (54) మరణించారు. భార్య నటాలి ఎలియట్, ముగ్గురు కూతుళ్లు ఎడీ, ఇన్స్, బన్నీ సమక్షంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గ్రాంజర్ తుదిశ్వాస విడిచారు.
బిల్ గ్రాంజర్ కుక్‌గా మూడు దశాబ్ధాల కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు పలు మైలురాళ్లను అధిగమించారు. 1999లో తన భార్య నటాలీతో కలిసి బిల్ తన రెస్టారెంట్ బిజినెస్‌ను ప్రారంబించాడు. ఇప్పుడు సిడ్నీ, లండన్, గ్రేటర్ టోక్యో, ఒసాకా, సియోల్ అంతటా 19 రెస్టారెంట్లకు తమ సంస్ధలను విస్తరించారు.
బిల్ గ్రాంజర్ 14 కుక్‌బుక్స్ రచించగా, 5 టీవీ సిరీస్‌లు రూపొందించారు. మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో కూడా బిల్‌ను ప్రభుత్వం గౌరవించింది. కింగ్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్‌గానూ బిల్ పేరొందారు. ఆస్ట్రేలియన్ ఫుడ్ పయనీర్ మృతి పట్ల పలువురు కుక్స్, సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.
Read More :
Kajal Aggarwal | బార్బీ డాళ్‌గా మారిపోయిన కాజల్ అగర్వాల్.. ట్రెండింగ్‌లో స్టిల్స్