న్యూఢిల్లీ : శీతాకాలంలో జామ కాయను తీసుకోవడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రుచితో పాటు పలు వ్యాధులను నియంత్రించే గుణం ఈ పండులో ఉన్నదని సూచిస్తున్నారు. మధుమేహులు, హృద్రోగులు, రక్తపోటు బాధితులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులతో బాధపడే వారు సైతం జామకాయను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. జామకాయల్లో ఉండే పోషకాలు, విటమిన్లు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సీ, ప్రొటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం జామకాయలను తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండును రెగ్యులర్గా తీసుకోవడంతో ఇన్ఫెక్షన్లు దూరమై దగ్గు, జలుబును సులభంగా నివారించవచ్చు. జామకాయతో మనకు కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
మలబద్ధకం దూరం
బలమైన రోగనిరోధక వ్యవస్ధ
ఒత్తిడి మటుమాయం
బరువు తగ్గడం
మధుమేహ నియంత్రణ