న్యూఢిల్లీ : శరీరంలో వాపు ప్రక్రియ పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లమేషన్కు వైద్యచికిత్స తీసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్ దానంతటదే తగ్గినా మరికొన్ని దీర్ఘకాలం బాధిస్తుంటాయి. వంటింటి చిట్కాలతో పాటు ఆరోగ్యకర ఆహారంతో ఇన్ప్లమేషన్ దరిచేరకుండా చూసుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐదు పానీయాలతో శరీరంలో వాపు ప్రక్రియను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పసుపు పాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి. గోరువెచ్చని పాలలో అరకప్పు పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. రుచి కోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. యూపిల్, దాల్చినచెక్క స్మూతీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు పుష్కలంగా ఉంటాయి. యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వాటిలో దాల్చినచెక్క నీటిని కలిపి స్మూతీగా తయారుచేసుకోవచ్చు. పలు అనారోగ్యాలకు మూలమైన వాపు ప్రక్రియను నివారించేందుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలు మెండుగా ఉన్న బెర్రీ బ్లాస్ట్ ఉపకరిస్తుంది.
స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, రాస్ప్బెర్రీస్తో ఈ డ్రింక్‌ను తయారుచేసుకోవచ్చు. ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలున్న గ్రీన్ జ్యూస్ కూడా పలు అనారోగ్యాలను నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్తో బాధపడేవారు పాలకూర, గ్రీన్ యాపిల్, తేనెను కలిపి డ్రింక్‌ను తయారుచేసుకుని తాజాగా సేవించవచ్చు. జింజర్ లెమన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధ గుణాలు, సాంత్వన చేకూర్చే ఔషధాలున్నాయి. ఈ డ్రింక్‌ను తయారు చేసేందుకు నీటిలో అల్లం, తేనె, కొన్ని టీ ఆకులు వేసి వేడి చేయాలి. దీన్ని ఓ గ్లాసులో పోసి నిమ్మరసం వేసుకుని వేడిగా తీసుకోవాలి.