న్యూఢిల్లీ : నీళ్ల విరేచనాలతో బాధపడే వారికి సహజసిద్ధంగా సరైన ఆహారంతో ఉపశమనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, ఏదైన తిన్న వెంటనే విరేచనాలు కావడం, డీహైడ్రేషన్, వాంతుల వంటి లక్షణాలను తగిన ఆహారం తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చు.
నీళ్ల విరేచనాలతో ఆకలి మందగించడం, అజీర్తి సమస్యలు, అలసట, కడుపునొప్పి, నీరసం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. లూజ్ మోషన్స్, డయేరియా సరిగ్గా వండని ఆహార పదార్ధాలు, ఆహారంలో కల్తీ వల్ల బాధిస్తుంటాయి. విరేచనాలతో బాధపడే వారికి వైద్యులు ద్రవపదార్ధాలను సూచిస్తుంటారు.
తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు తోడ్పడే అరటి పండ్లు, యాపిల్స్, టోస్ట్, రైస్, ఉడకబెట్టిన బంగాళదుంపలతో పాటు నీరు అధికంగా తీసుకోవాలి. మరోవైపు కొబ్బరి నీళ్లు అజీర్తి సమస్యలను నివారించి శరీరం డీహైడ్రేషన్‌కు లోనవకుండా చూస్తాయి.