puneeth rajkumar | ఫిట్నెస్ కోసం అతిగా జిమ్ చేస్తున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఇవాళ ఉదయం జిమ్‌లో వ్యాయమం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు గురై కుప్పకూలాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా పునీత్ కన్నుమూశాడు. ఇప్పుడు ఈ వార్త అన్ని సినీ ఇండస్ట్రీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే పునీత్ వయసు 46 ఏళ్లు మాత్రమే. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్య కూడా లేదు. రోజూ వ్యాయమం చేస్తూ ఫిట్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో మరణించడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడే మరో వార్త కూడా వినిపిస్తుంది. అతిగా వ్యాయామం చేయడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉందని.. పునీత్ మరణానికి కూడా ఇదే కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో జిమ్ చేస్తూ పలువురు చనిపోయిన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు జిమ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో జిమ్ చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదనే అంశాలను ఒకసారి చూద్దాం..

వెంటిలేషన్ సరిగా లేని జిమ్‌లలో వ్యాయామం చేయొద్దు. చిన్న చిన్న గదుల్లో వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసినప్పుడు వదిలే గాలినే తిరిగి తీసుకోవాల్సి వస్తుంది. దీంతో రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరుగుతుంది. విపరీతమైన తలనొప్పి రావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఫిట్‌గా ఉండేందుకే..
వెయిట్‌లాస్, వెయిట్ గెయిన్ కోసం అనేక మంది జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంత మంది ఫిట్నెస్ కోసం వెళ్తున్నారు. ఉద్యోగులు, మహిళలు అధిక బరువు, థైరాయిడ్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అమ్మాయిలైతే నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు, యువలకులైతే మజిల్స్, చెస్ట్ పెంచుకునేందుకు త్రెడ్మిల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్ట్, కార్డియో, జుంబా, స్పిన్ సైకిల్ తదితర వాటితో ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.
జాగ్రత్తలు ఇలా..

- మందులు వాడుతున్న వారు వైద్యుల సూచనల మేరకే వ్యాయామం చేయాలి.
- ప్రతి జిమ్‌లో తప్పనిసరిగా మెడికల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- సామర్థ్యానికి మించి వ్యాయామం చేయకూడదు.
- జిమ్‌లో వెంటిలేషన్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
- అతి బరువైన పరికరాలను ఎత్తొద్దు.
- వ్యాయామం చేస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించరాదు.
- వాటర్ బాటిల్, టవల్, లెమన్ వాటర్, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ వెంట తెచ్చుకోవాలి.
- కసరత్తుల కోసం ఉపయోగించే పరికరాల గురించి తప్పక తెలుసుకోవాలి.
- ఒకే రకమైన కసరత్తులు కాకుండా విభిన్నమైనవి చేయాలి.
- హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉన్నప్పుడే వ్యాయామం చేయాలి.
- నిపుణుడైన కోచ్ దగ్గరే వ్యాయామాలు నేర్చుకోవాలి.
- వర్కౌట్‌కు ముందు బాదం, కర్జూరం తింటే మేలు. అవి ఆక్సిజన్ ఇచ్చే సామర్థ్యాన్ని పెంచుతాయి.
- కసరత్తులు చేసిన తర్వాత పండ్లు, గుడ్డు తీసుకుంటే ఒంటి, కండరాల నొప్పులు రావు.

సరైన ట్రెయినర్‌ను ఎంచుకోవాలి
జిమ్ జీవితంలో ఓ భాగమైంది. థైరాయిడ్, అర్థరైడ్తో బాధపడే వారు ఎక్కువగా జిమ్‌లకు వస్తున్నారు. 50 ఏండ్లు పైబడిన వారు మోకాళ్ల నొప్పులు, బీపీ తగ్గించుకునేందుకు వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం సరైన శిక్షణ లేని వారు జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సరైన ట్రెయినర్‌ను ఎంచుకొని అప్పుడే జిమ్‌లో చేరాలి.
– రౌనాక్ సిద్ధిక్, జిమ్ ట్రెయినర్

వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ వద్దు
వ్యాయామం చేసేటప్పుడు మాస్క్‌లు ధరించవద్దు. ఓ వేళ అలా చేస్తే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. మాస్క్ ఉంటే పీల్చిన గాలినే తిరిగి తీసుకోవాల్సి రావడంతో రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగే ప్రమాదం ఉంటుంది. బలహీనంగా ఉన్న వారికి లంగ్స్ సరిగా పని చేయవు. దీంతో ఒత్తిడి పెరిగి కార్డియా అటాక్‌తో మరణించే అవకాశం ఉంటుంది.
-స్వాతిరెడ్డి, ట్రెయినర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

