Fibre : ఆహారంలో తగినంత ఫైబర్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు మలబద్ధకం నివారించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇక ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాల విషయానికి వస్తే ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రించడంతో పాటు బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఓట్స్ తరచూ తీసుకోవడం ద్వారా హృద్రోగ ముప్పును తగ్గించవచ్చు.
పైబర్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పప్పు ధాన్యాలు తింటే ప్రేవుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పప్పు ధాన్యాల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, ఆరోగ్యకర జీర్ణవ్యవస్ధకు ఊతమిస్తుంది. చియా గింజల్లో కూడా ఫైబర్ అధికంగా ఉండటంతో వీటిని తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు. వీటిలో ఉండే ఫైబర్ షుగర్, కొలెస్ట్రాల్ రక్తంలోకి వెళ్లే ప్రక్రియ నిదానమవుతుంది. ఇది జీవక్రియల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇక ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
ఓట్స్
పప్పు ధాన్యాలు
చియా సీడ్స్
అవకాడో
బెర్రీస్
బ్రకోలి
క్వినోవా
బాదం
స్వీట్ పొటాటో
యాపిల్
Read More :