IT Employees | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీలివర్ వ్యాధి ముప్పు పొంచి ఉన్నట్టు ఓ శాస్త్రీయ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఉటంకిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్లో ప్రకటన చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. జీవక్రియ సరిగ్గా పనిచేయకపోవడంతో వచ్చే ఫ్యాటీ లివర్ (ఎంఏఎఫ్ఎల్డీ) వ్యాధి మహమ్మారిలా విస్తరిస్తుండటం ఆందోళనకరంగా మారింది.
71 శాతం మంది ఊబకాయం (బరువు అధికంగా ఉండటం), 34 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. మూడింట ఒక వంతు కంటే ఎక్కువమంది జీవక్రియ సంబంధిత రుగ్మతలతో పడుతున్నారని ఈ రిపోర్టు వెల్లడించింది. ఇది డయాబెటిస్, హృదయ సంబంధ వ్యా ధులు, గుండెపోటుకు కారణమవుతున్నట్టు పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) పరిశోధనల ప్రకారం.. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాం తాల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి 37.19 శాతంగా ఉందని, ఇది పట్టణ కేంద్రాల కంటే అధికంగా ఉన్నదని నడ్డా వెల్లడించారు.
ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటి ఆరోగ్యానికి హానికరమైన ఆహారం తినడం, అధిక పని ఒత్తిడి కారణంగా ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు మీడియా మాధ్యమాల ద్వారా కాలేయం ఆరోగ్యంపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నట్టు నడ్డా తెలిపారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే ఐటీ ఉద్యోగాల స్వభావాన్ని గుర్తించి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆఫీసు సమయంలో ఐదు నిమిషాలపాటు ‘యోగా బ్రేక్’ నియమాన్ని తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు.
ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్(ధ్యానం) చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చని ఆ అధ్యయ నం సూచించింది. ఈ విషయమై వెంటనే రా ష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుగజేసుకుని ఉద్యోగులకు స్క్రీనింగ్ చేయించాలని అవసరమైన చికిత్స అందించడంలో చొరవ చూపాలని ఆయన కోరారు. ఫ్యాటీ లివర్ వ్యాధులు తప్పనిసరిగా శ్రామిక శక్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.