న్యూఢిల్లీ : ఉపవాసం (Gut Health) ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, చాలా గంటల పాటు ఆహారానికి దూరంగా ఉండే ఎక్స్టెండింగ్ ఫాస్టింగ్ వంటివి పలువురు పాటిస్తుంటారు. అయితే ఉపవాసంతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుంది, ప్రేవుల ఆరోగ్యంపై ఉపవాసం ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి.
జీర్ణశక్తి సజావుగా సాగేందుకు, పోషకాలను గ్రహించేందుకు, మెరుగైన ఇమ్యూనిటీ కోసం ప్రేవుల ఆరోగ్యం కీలకం. అయితే ఇంతటి ముఖ్యమైన ప్రేవుల ఆరోగ్యంపై ఫాస్టింగ్ అధిక ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఫాస్టింగ్ ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు ప్రేవుల్లో వాపును ఫాస్టింగ్ నివారిస్తుంది. ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) లక్షణాలను తగ్గించి ప్రేవులు ఆరోగ్యంగా ఉండేలా ఫాస్టింగ్ ఉపకరిస్తుంది. ఇంకా ఫాస్టింగ్తో ప్రేవుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని పరిశీలిస్తే..
ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి
ఇన్ఫ్లమేషన్కు చెక్
ప్రేవుల డిజార్డర్ల నివారణ
బరువు నియంత్రణ
Read More :