గజ్జె ఘల్లు.. గుండె ఝల్లు!
పేరుకు ఏడువారాల నగలే కానీ.. ఏడైనా ఘల్లుమన్నాయా? వడ్డాణమనే పేరుతో వగలుపోవడమే తప్పించి.. ఫక్కున నవ్విందా? వజ్రపుటుంగరమని విర్రవీగడంతోనే సరిపోయింది.
పేరుకు ఏడువారాల నగలే కానీ.. ఏడైనా ఘల్లుమన్నాయా? వడ్డాణమనే పేరుతో వగలుపోవడమే తప్పించి.. ఫక్కున నవ్విందా? వజ్రపుటుంగరమని విర్రవీగడంతోనే సరిపోయింది. ఓ ఉలుకూ లేదు, పలుకూ లేదు. అదే, వెండి మువ్వలైతే ఆ సందడే వేరు. లోలాకులతో కలిసి కులుకుతాయి. గాజులతో ములాఖత్ అయిపోయి గలగలమంటాయి.

కాలి అందెలకు చెలికత్తెలై అందగత్తె అడుగులకు మడుగులొత్తుతాయి. కాబట్టే, తేజహ్ అనే జువెలరీ కంపెనీ మువ్వలతో ముస్తాబైన వెండి ఆభరణాలను తీసుకొచ్చింది. నెక్లెస్ నుంచి పాలి పట్టీల వరకు.. ప్రతి నగకూ మువ్వల వగలు జోడించింది. చీరకట్టు మొదలు మినీ స్కర్ట్ వరకు దేనికైనా అతికినట్టు సరిపోతాయి. అతివ నడకకు నేపథ్య సంగీతం వినిపిస్తాయి. ధరలు వంద పైచిలుకుతో మొదలవుతాయి.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

