న్యూఢిల్లీ : ఉదయాన్నే లేదా లంచ్ తర్వాత ఓ కప్పు కాఫీ తీసుకుంటే శారీరక ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పరిమిత మోతాదులో కాఫీ తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులూ స్పష్టం చేస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్లో గుండెకు మేలు చేసే గుణాలతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ కొన్ని రకాల క్యాన్సర్లనూ దరిచేరకుండా చేస్తుందని చెబుతున్నారు.
కాఫీలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే మెగ్నీషియం, పొటాషియం, విటిమిన్ ఈ వంటి సూక్ష్మ పోషకాలున్నాయి. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్ ఈ పలు రకాల హృద్రోగాలను నివారిస్తుందని, పరిమిత మోతాదులో కాఫీ తీసుకుంటే ఆందోళన, కుంగుబాటులను నివారించి ఏకాగ్రత, నిలకడ లభిస్తుందని ఏషియన్ ఆస్పత్రి (ఫరీదాబాద్)కి చెందని హెడ్ డైటీషియన్ కోమల్ మాలిక్ చెప్పారు.
మనసును తేలికపరిచి కుంగుబాటును నివారించడంలో కాఫీ దివ్యౌషధంలా పనిచేస్తుందని, ఇందులో ఉండే పాలిఫెనాల్ శరీరంలో వాపును తగ్గిస్తుందని, పార్కిన్సన్ వ్యాధితో బాధపడే వారికి ఇది మేలు చేస్తుందని పోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఢిల్లీ)కు చెందిన పోషకాహార నిపుణులు దల్జిత్ కౌర్ పేర్కొన్నారు. రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీలో చక్కెర తక్కువగా తీసుకుంటే క్యాలరీలు అధికం కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.