న్యూఢిల్లీ : రక్తహీనతను నివారించి రోజంతా చురుకుగా, ఉత్తేజంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ఆహారంలో ఐరన్ (Health Tips) అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆక్సిజన్‌ను శరీర భాగాలకు చేరవేయడంలో ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ అవసరం. రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడినంత ఉండాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను నిత్యం తీసుకోవాలి.
కండరాలకు ఆక్సిజన్ సరఫరా, జీవక్రియల వేగం పెరిగేందుకు, రోగనిరోధక వ్యవస్ధ బలంగా ఉండేందుకు ఐరన్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఐరన్ ఫుడ్ ప్రతిఒక్కరూ విధిగా తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా చెబుతున్నారు. ఐరన్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది నువ్వులు. నువ్వులను కూరల్లో, ఇతర వంటకాల్లో వాడటంతో పాటు నేరుగా కూడా తీసుకోవచ్చు.
వీటిలో ఐరన్‌తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఇతర అత్యవసర పోషకాలూ ఉంటాయి. ఇంకా పాలకూర, దుంప ఆకుకూరల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌తో పాటు ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఐరన్ అధికంగా ఉన్న ఆహారాన్ని కూరగాయలు, పండ్లు వంటి విటమిన్ సీ కలిగిన ఆహారంతో కలిపి తీసుకుంటే శరీరం ఐరన్‌ను మెరుగ్గా గ్రహిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Read More :