కేగెల్ వ్యాయామం అంటే..
కటి ప్రాంతంలోని కండరాలు గట్టిపడేందుకు చేసే వ్యాయామాలనే ‘కేగెల్ ఎక్సర్సైజెస్' అని పిలుస్తారు. వీటివల్ల యోనిభాగం కూడా బిగుతుగా తయారవుతుంది. కాన్పులో బిడ్డ తల బయటికి వచ్చేందుకు వీలుగా గర్భధారణ సమయంలో తల్లి కటి ప్రాంతంలోని లిగమెంట్లు వదులవుతాయి.
కేగెల్ ఎక్సర్సైజులు అంటే ఏమిటి? వీటిని ఎవరు చేయాలి? ఈ వ్యాయామాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
- ఓ పాఠకురాలు
కటి ప్రాంతంలోని కండరాలు గట్టిపడేందుకు చేసే వ్యాయామాలనే ‘కేగెల్ ఎక్సర్సైజెస్’ అని పిలుస్తారు. వీటివల్ల యోనిభాగం కూడా బిగుతుగా తయారవుతుంది. కాన్పులో బిడ్డ తల బయటికి వచ్చేందుకు వీలుగా గర్భధారణ సమయంలో తల్లి కటి ప్రాంతంలోని లిగమెంట్లు వదులవుతాయి. ప్రొజెస్టిరాన్, రిలాక్సిన్ హార్మోన్లు ఇందుకు దోహదం చేస్తాయి. అలాగే ఆ ప్రాంతంలో ఉండే కొలాజెన్ కూడా విచ్ఛిత్తి చెంది జనన ప్రక్రియకు సహకరిస్తుంది. ప్రసవం తర్వాత ఇవన్నీ పూర్వస్థాయికి రావడానికి కేగెల్ ఎక్సర్ సైజులు ఉపకరిస్తాయి.
మనం మూత్రాన్ని ఆపుకున్నప్పుడు ఆ భాగాన్ని ఎలా బిగుతుగా చేస్తామో అలా పట్టి ఉంచి మళ్లీ వదులు చేయాలి. ఇలా చేస్తూ ఉంటే అదే… కేగెల్ వ్యాయామం. కూర్చుని, నిలుచుని, పనిచేసుకుంటూ… ఇలా ఎప్పుడైనా ఎన్నిసార్లయినా చేయవచ్చు. ప్రసవం తర్వాత గర్భసంచి జారిపోకుండా ఉండేందుకు కూడా ఈ కసరత్తు చాలా ఉపయోగపడుతుంది. ప్రసవమైన పదిహేను రోజుల తర్వాత నుంచి ప్రారంభించవచ్చు. మెనోపాజ్ సమయంలోనూ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గిపోయి కటి భాగంలోని కండరాలు, లిగమెంట్లు వదులు అయిపోతాయి. గర్భాశయం జారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ముట్లు ఆగిపోయే సమయంలోనూ ఈ వ్యాయామాలు చేయవచ్చు. ఇవి సురక్షితం కూడా.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

