Health Tips : చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని ఎవరైనా కోరుకుంటారు. క్రీములు, లోషన్ల కంటే మెరుగైన ఆహారంతోనే మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యం, నిగారింపుకు నిర్ధిష్టమైన ఆహార పదార్ధాలను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
మన ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే ఆహార పదార్ధాలను డైట్లో భాగంగా చేసుకుని నిగనిగలాడే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు. చర్మ ఆరోగ్యానికి అవకాడో అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యకర కొవ్వులు, ఈ, సీ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన అవకాడో పోషకాల గనిగా పేరొందింది. అవకాడోలో ఉండే అధిక నీరు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని పొడిబారకుండా చేస్తాయి.
వీటికి తోడు ఇందులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారి నుంచి కాపాడుతుంది. ఇక చర్మ సౌందర్యానికి బాదం కూడా అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. బాదం సహజసిద్ధమైన సన్స్క్రీన్గా చర్మాన్ని కాపాడుతుంది. యూవీ కిరణాల నుంచి, సన్బర్న్ నుంచి చర్మం దెబ్బతినకుండా చూస్తుంది. ఇక చర్మ సౌందర్యానికి ఉపకరించే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
అవకాడో
బాదం
టమాట
గ్రీన్ టీ
తేనె
ఓట్స్
పెరుగు
Read More :
Union Budget | భారీగా పెరగనున్న పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్ల ఖరీదు.. ఎందుకంటే..!