Union Budget | భారీగా పెరగనున్న పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్ల ఖరీదు.. ఎందుకంటే..!
Union Budget | పండుగలొచ్చినా, ఎన్నికలొచ్చినా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ స్థాయి నాయకుడి పుట్టిన రోజు వచ్చినా, అభిమాన హీరో సినిమా విడుదలైనా వీధుల్లో ఫ్లెక్సీలు వెలవాల్సిందే. నిలువెత్తు కటౌట్లు నిలవాల్సిందే.
Union Budget : పండుగలొచ్చినా, ఎన్నికలొచ్చినా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ స్థాయి నాయకుడి పుట్టిన రోజు వచ్చినా, అభిమాన హీరో సినిమా విడుదలైనా వీధుల్లో ఫ్లెక్సీలు వెలవాల్సిందే. నిలువెత్తు కటౌట్లు నిలవాల్సిందే. అయితే ఇకపై తమ నాయకుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వేయించడం అంత అంత సులువు కాకపోవచ్చు. ఎందుకంటే పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ (PVC flex banners) పై కస్టమ్ ట్యాక్స్‌ను కేంద్ర సర్కారు అమాంతం పెంచేసింది.
పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్‌పై ఇప్పటివరకు 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD) ని కేంద్రం ఇప్పుడు 25 శాతానికి పెంచింది. ఇవాళ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ సందర్భంగా ఈ బేసిక్ కస్టమ్ డ్యూటీ పెంపు విషయాన్ని ప్రకటించారు. పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్ అంత సులువుగా బయోడీగ్రేడ్ కావని, అవి పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని, అందుకే వాటి దిగుమతులకు అడ్డుకట్టవేసేందుకు కస్టమ్ డ్యూటీని పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
పీవీసీ ఫ్లెక్స్ ప్రింట్ ధరపై ఏకంగా 25 శాతం కస్టమ్ డ్యూటీ పెరగడంతో ఇప్పుడు బ్యానర్ల ఖర్చు తడిసి మోపెడు కానుంది. ఈ ప్రభావం సినీ, రాజకీయ నాయకుల అభిమానులపైన మాత్రమే కాకుండా.. రాజకీయ నాయకులపైన, రాజకీయ పార్టీలపై కూడా పడనుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

