Daily One Carrot | మనం రోజూ రకరకాల కూరగాయలను తింటుంటాం. అన్ని రకాల కూరగాయలు లేదా ఆకుకూరలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతాయి. అయితే కూరగాయల్లో క్యారెట్లు ప్రత్యేకమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని ఉడికించాల్సిన పనిలేదు. నేరుగా అలాగే పచ్చిగా తినవచ్చు. ఈ క్రమంలోనే రోజూ క్యారెట్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. క్యారెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలకు క్యారెట్లు నెలవుగా ఉన్నాయి. క్యారెట్లను రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు ఎంతో లాభం కలుగుతుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు. క్యారెట్లను రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లలో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రోజుకు ఒక క్యారెట్‌ను తింటే కొన్ని రోజులకు చూపు స్పష్టంగా మారుతుంది. దీంతో కళ్లద్దాలను తీసి పడేస్తారు. క్యారెట్‌ను రోజుకు ఒకటి తింటే రేచీకటి సమస్య కూడా ఉండదు. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాల సమస్య నుంచి సైతం బయట పడవచ్చు. కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. క్యారెట్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలాగే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
క్యారెట్లలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యకాంతి నుంచి కాపాడుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. చర్మంలో సహజసిద్ధమైన కాంతి పెరుగుతుంది. చర్మం యొక్క టోన్ మెరుగు పడుతుంది. క్యారెట్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల రోజుకు ఒక క్యారెట్‌ను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
క్యారెట్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. క్యారెట్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. సాయంత్రం స్నాక్స్‌కు బదులుగా క్యారెట్‌ను తింటే బరువు తగ్గవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లను తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.
క్యారెట్లలో లుటీన్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల మెదడు పనితీరును ఇవి మెరుగు పరుస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటాము. అలర్ట్‌నెస్ పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. క్యారెట్‌ను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఇలా క్యారెట్లను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి రోజుకు ఒక క్యారెట్‌ను తినడం మరిచికపోకండి.