ఎండలకు జాగ్రత్త!
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
ఇలా చేద్దాం..
- నీటిశాతం ఎక్కువగా ఉండే టమాట, దోస, బీర, సొరకాయ తదితర కూరగాయలు తినాలి.
- రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. నోరు ఎండిపోతున్నట్లు, దప్పిక అవుతున్నట్లు, ఆయాసం వస్తున్నట్లు అనిపిస్తే మరిన్ని నీళ్లు తాగాలి.
- అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవద్దు. పచ్చి ఆహార పదార్థాలు ముట్టుకోవద్దు. కాచి చల్లార్చని నీళ్లు తాగవద్దు.
- మసాలాలు దట్టించిన ఆహారం వల్ల ఎక్కువగా చెమటపడుతుంది. ఫలితంగా శరీరంలోని నీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మసాలాలు పరిమితంగా తీసుకోండి. అసలు తీసుకోకున్నా మంచిదే.
- వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే… వెంటనే నిమ్మ రసంలో చిటికెడు ఉప్పు కలుపుకొని తాగండి. దీనివల్ల మనం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ శరీరానికి అందుతాయి.
- బయటికి వెళ్తున్నప్పుడు నీళ్లు కానీ, ద్రవరూప ఆహారం కానీ (పళ్ల రసాలు, జావలాంటివి) వెంట తీసుకెళ్లడం మంచిది.
ఇవి వద్దు..
- సూర్యుడి ప్రతాపం నుంచి తప్పించుకోవాలంటే.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి పోవద్దు.
- నలుపు రంగు వస్ర్తాలు వద్దు. బాగా బిగుతుగా ఉండే దుస్తులు అసలు ధరించవద్దు. కాటన్ మేలు.
- మూత్రం నీళ్లలా పారదర్శకంగా లేదా కొద్దిగా పసుపు రంగులో వస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు. బాగా ముదురు పసుపు రంగులో ఉంటే వడదెబ్బ తగిలిందని అర్థం.
- ముఖానికి పౌడర్ రాయకపోవడమే మంచిది. చెమటపడితే చారలు చారలుగా పేరుకుపోతుంది. అసౌకర్యంగా కూడా ఉంటుంది.
- ముఖాన్ని ఎండ నుంచి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ క్రీమ్ రాయండి. వీలైనంత వరకు మేకప్ లేకపోవడమే ఉత్తమం. తప్పకపోతే, కొద్దిగా వేసుకోండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

