Ear Infection @ Winter | చలికాలం వచ్చిందంటే వణికించే చలితోపాటు అనేక రోగాలు కూడా దాని వెంటే వస్తుంటాయి. ముఖ్యంగా అన్ని వయసుల వారిలో చెవి ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. చెవుల్లో సున్నితత్వం ఎక్కువగా ఉండి చలిగాలి తగిలినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇది చికాకును పెంచి లోపల పేరుకునే తేమ, వైరస్ లేదా బ్యాక్టీరియా తీవ్ర నొప్పి స్థితిని కలుగచేస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన పదార్థం యూస్టాషియన్ ట్యూబ్‌కు అడ్డం పడి.. కర్ణభేరి వెనకాల పెరగటం ప్రారంభిస్తుంది. ఇది నొప్పి, ఇన్ఫెక్షన్ను పెరిగేలా చేస్తుంది.
వైరస్లు, బ్యాక్టీరియా చలిలో వృద్ధి చెందుతాయి. కాబట్టి ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చెవులకు కూడా హాని కలిగిస్తుంది. సీజన్ చలికి మారినప్పుడు మన రోగనిరోధక శక్తి రాజీపడుతుంది. ఫలితంగా చెవి మంట ఏర్పడుతుంది. ఇది చికాకుకు దారితీస్తుంది. చెవిలో చిక్కుకుపోయిన బ్యాక్టీరియా చెవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. గొంతు నొప్పి లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సైనసైటిస్ కూడా చెవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
సరైన రక్షణ లేకుండా చలిలో బయట ఎక్కువ సమయం గడపడం వల్ల వినికిడి లోపం ఏర్పడుతుంది. చెవులు క్రమం తప్పకుండా తక్కువ ఉష్ణోగ్రతలకు గురైన సందర్భాల్లో చెవి కెనాల్లో అస్తి పెరుగుతంది. ఇది చెవి ఆరోగ్యానికి హాని కలిగించే ఎముకల పెరుగుదల రకం. ఇది చెవి కెనాల్‌ను ఇరుకైనదిగా చేసి.. నీరు, మైనం, దుమ్ము ధూళి బయటకు విడుదల చేయడం కష్టతరంగా మారుస్తుంది. దాతో చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి నష్టానికి దారితీస్తుంది.
లక్షణాలిలా ఉంటాయ్..
తీవ్రమైన చెవినొప్పి వస్తుంది.
తలనొప్పి ఇబ్బంది పెడుతుంది.
అప్పుడప్పుడు వాపు కూడా కనిపిస్తుంది.
వినికిడి సమస్యలు తలెత్తుతాయి.
చెవుల్లోంచి చీము లేదా రక్తం కారుతుంది.
చెవుల్లో గింగురుమంటూ శబ్దాలు వినిపిస్తాయి.
జ్వరం వస్తుంది.
ఆకలి తగ్గిపోతుంది.
ఇలా నివారించుకోవాలి..
చలి గాలి నుంచి రక్షించుకోవడానికి పత్తిని చెవుల్లో పెట్టుకోవాలి.
బయటకు వెళ్లేటప్పుడు చెవులను పూర్తిగా కప్పి ఉంచాలి.
చెవులకు వెచ్చదనం కోసం ఇయర్ మఫ్, హెడ్‌బ్యాండ్ ధరించాలి.
స్నానం చేసిన తర్వాత టవల్‌తో చెవుల్ని శుభ్రం చేసుకోవాలి.
వీలైనంతగా చెవులను పొడిగా ఉండేలా చూసుకోవాలి.
కాటన్ బడ్స్, ఇయర్ బడ్స్ వినియోగం మానుకోవాలి.
అలెర్జీలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
జలుబు, ఫ్లూతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండాలి.
చేతును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
సిగరెట్ స్మోకింగ్ మానుకోవాలి.
కాలుష్యం వెదజల్లే ప్రాంతాలకు వెళ్లొద్దు.
ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి.
రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఆరోగ్యకర ఆహారాలు తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.