Herbal Tea | రోజూ ఉదయాన్నే చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. చల్లని వాతావరణంలో వేడి వేడిగా టీ తాగుతుంటే వచ్చే మజాయే వేరు. చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగకపోతే రోజును ప్రారంభించినట్లు సంతృప్తి ఉండదు. ఈ క్రమంలోనే చాలా మంది ఉదయం మొదటగా టీ సేవిస్తుంటారు. అయితే సాధారణ టీని రోజుకు పరిమిత మోతాదులోనే తాగాలి. అధికంగా సేవిస్తే టీలో ఉండే కెఫీన్, టానిన్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కానీ రోజూ హెర్బల్ టీలను సేవిస్తే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీలను సేవిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామం చేసిన అనంతరం ఈ హెర్బల్ టీలను సేవించాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
వ్యాయామం చేసిన వెంటనే లేదా శారీరక శ్రమ చేసిన వెంటనే హెర్బల్ టీలను సేవించడం ఉత్తమం. ముఖ్యంగా గ్రీన్ టీని సేవించాలి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీని సేవించడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే ఉత్సాహంగా ఉండవచ్చు. యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అంత సులభంగా అలసిపోరు. దీంతో బద్దకం పోతుంది. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. అలాగే వ్యాయామం చేసిన అనంతరం బ్లాక్ టీని కూడా సేవించవచ్చు. అయితే ఇందులో చక్కెర కలపకుండా తాగితే మేలు జరుగుతుంది.
బ్లాక్ టీలోనూ అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వ్యాయామం చేసిన అనంతరం బ్లాక్ టీని సేవిస్తుంటే తిరిగి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేయవచ్చు. బ్లాక్ టీ వల్ల శరీరంలో నైట్రిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శక్తిని అందిస్తుంది. అందువల్ల ఎంత పనిచేసినా అలసట రాదు. చురుగ్గా ఉంటారు. ఇక వ్యాయామం చేసిన తరువాత తాగాల్సిన టీలలో అల్లం టీ కూడా ముఖ్యమైనది. అల్లంను నీటిలో వేసి మరిగించి వడకట్టి తాగుతుండాలి. అవసరం అనుకుంటే అందులో కాస్త తేనె కలుపుకోవచ్చు. అల్లం టీని సేవించడం వల్ల మెటబాలిజం పెరిగి కొవ్వు కరగడమే కాదు, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
ఇవే కాకుండా మార్కెట్లో మనకు పలు హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు కమోమిల్ టీ, మందార పువ్వుల టీ, గులాబీ పువ్వుల టీ, పుదీనా టీ, తులసి ఆకుల టీ.. ఇలా రకరకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏ టీని అయినా సేవించవచ్చు. ఇవి మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగేలా చేస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా వ్యాయామం చేసిన అనంతరం ఈ టీలను సేవిస్తుంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. దీంతో రోజంతా శక్తి స్థాయిలు తగ్గకుండా అలాగే ఉంటాయి. ఉత్సాహంగా, చురుగ్గా పనిచేసుకోవచ్చు. అలాగే రోగాలు రాకుండా కూడా ఈ టీలు మనల్ని రక్షిస్తాయి. కనుక ఈ టీలను రోజూ తాగితే మంచిది.