Fenugreek Water: ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
Fenugreek Water: వంటింట్లో దొరికే ఈ గింజలతో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇది ఔషధం మొదలుకొని సౌందర్య సాధనం వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీలో ...

(Fenugreek Water) మనం కొత్తిమీర వాడినంతగా మెంతి గింజలను వాడం. ఎందుకంటే ఇవి కొంచెం చేదుగా ఉండటమే ప్రధాన కారణం. ఇవి రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వంటింట్లో దొరికే ఈ గింజలతో ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇది ఔషధం మొదలుకొని సౌందర్య సాధనం వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. మెంతి గింజల్లో విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మం మెరిసేలా చేయడంతోపాటు జట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట పరిగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే మధుమేహం, మలబద్ధకం వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.
మెంతి ద్రావణం తయారు ఎలా?

మెంతి నీరు తయారు చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఒకటి, ఒకటిన్నర చెంచాల మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. అనంతరం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. వడగట్టగా మిగిలిన మెంతి గింజలను విసిరేయకుండా వంటల్లో వాడుకోవచ్చు లేదా తినొచ్చని గుర్తుంచుకోండి. మెంతులు వేడి చేస్తాయి. అందుకని గర్భిణులు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.
మెంతి ద్రావణంతో ప్రయోజనాలు
బరువు తగ్గించడం
మెంతి కూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
మెంతి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిని వివిధ సౌందర్య సాధనాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. మెంతి ఆకుల్లో ఉండే ప్రొటీన్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
కడుపు నొప్పులు
మెంతి నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మెంతి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
గుండెకు మంచిది
మెంతి గింజల నీరు గుండెలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.
మధుమేహానికి చెక్
పురాతన కాలం నుంచి మధుమేహాన్ని నియంత్రించేందుకు మెంతి గింజలను వాడుతుంటారు. ప్రతీ నిత్యం మెంతి నీరు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మెంతి గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. మెంతి గింజ నీటిని నిత్యం 3 సార్లు తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Itllu Arjuna | అనీష్ ‘ఇట్లు అర్జున’ రివ్యూ.. కొత్త పోరడు హిట్ కొట్టాడా?
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

