తాజా పండు ఆరోగ్యం బాగుండు.. తెలిసిందే. ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు, ఖనిజ లవణాలు పండ్లలో ఉన్నాయని ఎరుకే! ఏ వయస్సు వారైనా ఆహారంలో పండ్లను తప్పకుండా చేర్చుకోవాలనేది పెద్దల మాట. అయితే, చాలామందికి.. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం అలవాటు.
కానీ కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనివల్ల లాభాలకు బదులు నష్టాలే ఎక్కువని సూచిస్తున్నారు. యాపిల్, అరటి, పుచ్చ, దోస, జామ వంటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి, దగ్గు వస్తుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, క్యాల్షియం కలిగివున్న అరటిపండు తిన్న వెంటనే అర టీ కప్పు నీళ్లు కూడా గొంతులో పోసుకోవద్దు. వాటర్‌మిలన్ తిన్న తర్వాత వాటర్ తాగొద్దు. దోసకాయ తిన్న తర్వాత నీళ్లు తాగినా మోసపోయే ప్రమాదం ఉంది. జామకాయలో ఫోలిక్ యాసిడ్ పొటాషియం వంటి పోషకాలుంటాయి. కానీ, జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే మాత్రం జీర్ణక్రియ మందగిస్తుంది. సో, పండ్లు తిన్న తర్వాత ఓ పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాటర్ పుచ్చుకోవడమే మంచిదన్నమాట.