యువకుడికి అరుదైన ఆటో-కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు
ఓ యువకుడికి అరుదైన ఆటో- కిడ్నీ మార్పిడి సర్జరీని ఢిల్లీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
న్యూఢిల్లీ : ఓ యువకుడికి అరుదైన ఆటో- కిడ్నీ మార్పిడి సర్జరీని ఢిల్లీ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఎడమ మూత్ర నాళంలో రాయితో పాటు కిడ్నీ, మూత్రాశయాన్ని కలిపే పైపు సంబంధ సమస్యతో బాధపడుతూ పంజాబ్‌కు చెందిన రోగి (29) గత నెలలో సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. మూత్ర నాళంలో రాయిని తీసేందుకు పంజాబ్‌లో వైద్యుడు ప్రయత్నించగా ఆ ప్రక్రియలో రాయితో పాటు 25-26 సెంటీమీటర్ల ఎడమ మూత్ర నాళం బయటకు వచ్చింది.
ఈ కేసులో అసాధారణంగా రోగి ఎడమ కిడ్నీ మూత్రాశయంతో కనెక్షన్ లేకుండా కనిపించడంతో ఆశ్చర్యపోయామని ఆపరేషన్ నిర్వహించిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ విపిన్ త్యాగి తెలిపారు. రోగి యువకుడి కావడంతో మూత్రాశయ పునర్నిర్మాణానికి ప్రేగు సరైన ప్రత్యామ్నాయం కాదని భావించామని, దీంతో తాము ఆటో-కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మేలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ రోగిలో సాధారణ కిడ్నీని ఎడమ వైపు నుండి బయటకు తీసి, దానిని దగ్గరగా తీసుకురావడం కుడి వైపున మూత్రాశయం ఉదరం నుండి కుడి కాలు వరకు వెళ్ళే రక్త నాళాలతో దానిని కలిపేలా చేశామని తెలిపారు.
దీంతో రెండు కిడ్నీలు కుడి వైపున ఉన్నాయని చెప్పారు. పునర్నిర్మించిన ట్యూబ్ మూత్రాశయానికి కనెక్ట్ చేయడంతో మూత్ర పిండాలకు రక్త ప్రసరణ పునరుద్ధరణ జరిగి ఈ ట్యూబ్ ద్వారా మూత్రం బయటకు వచ్చిందని డాక్టర్ త్యాగి వివరించారు. రోగి కోలుకున్నాడని, అతడి రెండు కిడ్నీలు శరీరానికి కుడి భాగంలో బాగా పనిచేస్తున్నందున ఇటీవల డిశ్చార్జి చేశామని యూరాలజీ విభాగం కో చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ చద్దా తెలిపారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

