Health Tips | 30ల్లో వచ్చే ముప్పులు తగ్గించుకోవడం ఎలా ? ఈ ఐదింటిని అస్సలు మిస్ కావొద్దు!
Health Tips | వయసుతో పాటు అనుభవం ఎంత వస్తుందో తెలియదు కానీ అజాగ్రత్తగా ఉంటే అనారోగ్యం మాత్రం మెండుగా వస్తుందట. ఆడవారైనా.. మగవారైనా ముప్పైల్లోకి వస్తున్నారంటే ముప్పుకు దగ్గర అవుతున్నారనే విషయం బాగా గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే 30ఏళ్లు వచ్చాక మనిషి శరీరంలో చాలా రకాల మార్పులు వస్తుంటాయి. అవి ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ముప్పైల్లోకి వచ్చాక మనం ఏం తింటున్నాం.. ఏం తినట్లేదు అన్న విషయాలను గమనించుకుంటూ ఉండాలి.
ముప్పైల్లోకి వచ్చిన తర్వాత శరీరానికి తప్పక అవసరమైన న్యూట్రియంట్లు కొన్ని ఉన్నాయి. ఆ న్యూట్రియంట్లు ఏంటో .. వాటిని కలిగి ఉండే ఆహార పదార్థాలేంటో త్వరగా తెలుసుకుందాం పదండి..
1. ఐరన్
ముప్పైల్లోకి వచ్చాక శరీరంలో ఐరన్ శాతం తగ్గుతుంటుంది. మీ ఆరోగ్యం బాగుండాలంటే తగ్గుతున్న ఐరన్ ను మీరు తిరిగి పెంపొందించుకోవడం చాలా అవసరం. ఐరన్ లోపంతో పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి ఐరన్ అందాలంటే పాలకూర, బ్రకోలిలతో పాటు నట్స్, విత్తనాలను మీ ఆహార పదార్థాల్లో తప్పక ఉండేలా చూసుకోవాలి.
2. విటమిన్-డీ
విటమిన్-డీ అనేది ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరసమైన న్యూట్రియంట్. శారీరక దృఢత్వంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హర్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు విటమిన్-డీ శరీరానికి బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం సాల్మన్, సారిడైన్ లాంటి చేపలతో పాటు పుట్టగొడుగులు, పాలు లాంటివి కూడా శరీరానికి సహజంగా విటమిన్-డిని అందిస్తాయి.
3. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్
ఈ మధ్య కాలంలో యుక్త వయసులోనే గుండె, బ్రెయిన్ సమస్యలతో ఇబ్బందులు అధికమవుతున్నాయి. గుండె, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా ఉండేందుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ కలిగి ఉండే ఆహార పదార్థాలు ప్రతిరోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకొండి. అన్ని రకాల చేపలతో పాటు వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలను తప్పక తినండి.
4. కాల్షియం
వయసు పెరిగేకొద్దీ ఎముకల్లో సాంద్రత తగ్గిపోతుంది. దీనిపై అజాగ్రత్తగా ఉంటే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎముకల్లో సాంద్రత పెంచే కాల్షియంను మీరు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం కండరాళ్ల కదలికలను మెరుగుపరచడంతో పాటు నరాల పనితీరును పెంచుతాయి. పాలు, వెన్న, యోగర్ట్ లాంటి పదార్థాలను మీ రోజూవారీ ఆహార పదార్థాల్లో చేర్చుకోవడం మర్చిపోకండి.
5. ఫొలేట్
రక్తకణాలు మెరుగ్గా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి ఫొలేట్ తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణీలకు దీని అవసరం బాగా ఉంటుంది. శనగలు, నట్స్, బ్రోకలీ లాంటి వాటిలో ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

