Health tips : ఎండు కొబ్బరి తింటే దగ్గు వస్తుందని, అజీర్తి సమస్య ఇబ్బంది పెడుతుందని దాన్ని దూరం పెడుతుంటారు. వంటల్లో అవసరం మేరకు వినియోగిస్తారే తప్ప నేరుగా తినే సాహసం చేయరు. కానీ ఎండుకొబ్బరితో ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఎండు కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. ఎండుకొబ్బరిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయని, అవి రకరకాల అనారోగ్యాల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయని సూచిస్తున్నారు.