Brinjal | వంకాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇందులో అనేక రకాలు ఉంటాయి. పర్పుల్, తెలుపు,గ్రీన్ కలర్లలో వంకాయలు మనకు అందుబాటులో ఉన్నాయి. వంకాయలతో ఏ కూర చేసినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. వంకాయలతో పచ్చడి, టమాటా కూర, వేపుడు ఎక్కువగా చేస్తుంటారు. వంకాయల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల వంకాయలను తినడం వల్ల సుమారుగా 17.8 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. ప్రోటీన్లు 8 గ్రాములు, శాచురేటెడ్ కొవ్వులు 5.2 గ్రాములు, ఫైబర్ 4.9 గ్రాములు, కొవ్వు 27.5 గ్రాములు, కొలెస్ట్రాల్ 16 మిల్లీగ్రాములు, చక్కెరలు 11.4 గ్రాములు, ఐరన్ 6 మిల్లీగ్రాములు లభిస్తాయి.
వంకాయలను తింటే విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. అలాగే క్యాల్షియం, సోడియం, పొటాషియం కూడా అధిక మొత్తంలో పొందవచ్చు. ప్లీహం వాపులకు గురైన వారు వంకాయలను తింటే ఎంతో ఫలితం ఉంటుంది. పచ్చి వంకాయ పేస్టుకి చక్కెర కలిపి ఉదయం తినాలి. దీంతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. వంకాయ, టమాటా కలిపి తింటే అజీర్తి తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. వంకాయను తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం కాస్త తింటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
వంకాయ సూప్‌ను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఇందులో ఇంగువ, వెల్లుల్లి వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సూప్‌ను తాగితే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. షుగర్ ఉన్నవారు వంకాయలను తింటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. వంకాయల్లో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కొన్ని ఆఫ్రికా దేశాల వారు వంకాయలను ఫిట్స్ తగ్గించేందుకు వాడుతారు. వంకాయల నుంచి రసం తీసి తయారు చేసిన ఆయింట్ మెంట్లు, టించర్లు పైల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. వంకాయలను పేదవారి ప్రోటీన్ ఫుడ్‌గా చెప్పవచ్చు. వంకాయలను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి.
అల్సర్ సమస్య ఉన్నవారు వంకాయలను తినకూడదు. గర్భిణీలు వంకాయలను తినడం మంచిది కాదు. తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొందరికి వంకాయ పడదు. దీన్ని తిన్న వెంటనే అలర్జీలు వచ్చి శరీరం దురద పెట్టే అవకాశం ఉంది. చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా వంకాయలకు దూరంగా ఉండాలి. వంకాయలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ ఆయా సమస్యలు ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. అలాగే ఆపరేషన్ చేయించుకోబోతున్న వారు, చేయించుకున్నవారు కూడా వంకాయలను తినకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు మాత్రమే వంకాయలను తినాలి. వంకాయలను అతిగా తింటే వాతం చేస్తుంది. కాబట్టి వీటిని మోతాదులోనే తినాలి.