Foot Massage | ఆయుర్వేదంలో బాడీ మసాజ్‌కు ఎంతో ప్రాధాన్యతను కల్పించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో పలు రకాల చికిత్సా పద్ధతుల్లో భాగంగా బాడీ మసాజ్ కూడా చేస్తారు. ఇందుకు గాను పలు రకాల నూనెలను పలు ఔషధాలతో కలిపి ఉపయోగిస్తారు. తరువాత స్టీమ్ బాత్ లేదా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా ఆయుర్వేదంలో కొన్ని రకాల చికిత్సల్లో పద్ధతులను అనుసరిస్తారు. దీని వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. వారంలో కనీసం ఒకసారి అయినా సరే ఇలా బాడీ మసాజ్ చేసుకుని స్నానం చేయాలని ఆయుర్వేదం చెబుతోంది. అందుకనే చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇలా తరచూ పాటిస్తుంటారు. అయితే బాడీ మసాజ్ మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో ఫుట్ మసాజ్.. అంటే పాదాల మసాజ్‌కు కూడా అధిక ప్రాధాన్యతను కల్పించారు. దీని వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది.
మన శరీరంలో భిన్న అవయవాలకు మసాజ్ చేస్తే భిన్న రకాల లాభాలు కలుగుతాయి. అయితే దాదాపు అన్ని అవయవాలను కలిపే నాడులు మాత్రం పాదాలకు అనుసంధానమై ఉంటాయి. అందువల్ల పాదాలకు మసాజ్ చేస్తే అనేక అవయవాలు, కణాలు ఉత్తేజితం చెందుతాయి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుకనే ఫుట్ మసాజ్‌కు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఫుట్ మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. మానసిక సమస్యలు ఉన్నవారికి, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఫుట్ మసాజ్ ఎంతో దోహదం చేస్తుంది. దీని వల్ల ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు.
ఫుట్ మసాజ్ వల్ల శరీరంలోని అనేక నాడులు యాక్టివేట్ అవుతాయి. దీంతో శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. ఇక ఫుట్ మసాజ్ వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. నాడులు రిలాక్స్ అవుతాయి. హార్మోన్ల పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. రుతు సమస్యలు తొలగిపోతాయి. అధిక రక్తస్రావం ఉండదు. మెనోపాజ్ దశలో ఉండే మహిళలు చికాకు, ఆందోళనను తగ్గించుకోవచ్చు. శరీరం అసౌకర్యంగా ఉందన్న భావన తొలగిపోతుంది. గర్భిణీలకు ఫుట్ మసాజ్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పాదాల వాపులను తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సుఖ ప్రసవం అయ్యేందుకు వీలు కలుగుతుంది. పాదాల్లో నీరు తగ్గి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఫుట్ మసాజ్ వల్ల కళ్లకు సంబంధించిన అనేక నాడులు ఉత్తేజితం చెందుతాయి. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కండరాలకు కూడా ఈ మసాజ్ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల కండరాల బలహీనత తొలగిపోతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. అలాగే మెదడు పనితీరు మెరుగు పడి యాక్టివ్‌గా మారుతారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఫుట్ మసాజ్ వల్ల తలకు అనుసంధానం అయి ఉండే నాడులు సైతం ఉత్తేజితం చెందుతాయి. దీని వల్ల తలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. తలనొప్పి తగ్గుతుంది. పాదాలకు, వెన్నెముకకు కలిపే నాడులు పాదాలలో ఉంటాయి. కనుక పుట్ మసాజ్ చేస్తే ఆయా నాడులు సైతం యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల వెన్నెముకకు శక్తి లభించి వెన్నెముక బలంగా మారుతుంది. ఇలా ఫుట్ మసాజ్ చేయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.