న్యూఢిల్లీ : టేస్టీ స్నాక్స్‌గా నోరూరించే వెజ్ సలాడ్స్‌ను మధుమేహులు (diabetes diet)నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోజూ తీసుకునే ఆహారం బదులు కలర్ఫుల్గా ఉంటూ, రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే సలాడ్స్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రోజూ తాజా కూరగాయలను తీసుకునేందుకు వెజ్ సలాడ్స్ అద్భుత అవకాశం.
సులభంగా తయారుచేసుకోవడంతో పాటు మధుమేహులు నోరూరించే రుచితో కూడిన ఈ సలాడ్స్‌ను తరచూ తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా మధుమేహం అదుపులో ఉంటూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇక మూంగ్ దాల్ సలాడ్ పోషకాలను అందించే దేశీ సలాడ్‌గా ముందువరసలో నిలుస్తుంది. ఈ సలాడ్‌ను మూంగ్ దాల్, క్యారట్స్, కొత్తమీర, కొబ్బరిని కలిపి తీసుకుంటే పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా మారుతుంది.
ఇక రాజ్మా, శనగల సలాడ్ అద్భుతమైన టేస్ట్‌తో పాటు ఇందులో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ సలాడ్‌తో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండవచ్చు. దేశీ సలాడ్స్‌లో అత్యంత టేస్టీగా నోరూరించే శనగల సలాడ్ ఎనర్జీని సరిపడా అందిస్తుంది. జీలకర్ర, ఆలివ్ ఆయిల్‌తో మిక్స్ చేసి తయారుచేసే ఈ సలాడ్‌ను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మేతి దనా సలాడ్, క్యాప్సికం, బ్రకోలి సలాడ్ కూడా మధుమేహులకు మెరుగైన ఎంపికలా చెబుతున్నారు.
Read More :
India-Canada Row | ఖలిస్తానీ గ్రూపులతో ఐఎస్ఐ ఏజెంట్ల రహస్య భేటీ..!