Health Tips | ఈ ఆహారంతో తగ్గనున్న హృద్రోగ ముప్పు
యువతలో ఇటీవల గుండె పోటు మరణాలు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హృద్రోగాలు (Health Tips) వెంటాడుతున్నాయి.
న్యూఢిల్లీ : యువతలో ఇటీవల గుండె పోటు మరణాలు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అనారోగ్యకర జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే హృద్రోగాలు (Health Tips) వెంటాడుతున్నాయి. గతంలో 60 ఏండ్లు దాటిన వారిలో గుండెపోటు సహా హృద్రోగాలు కనిపిస్తే ఇప్పుడు పాతికేండ్లు పైబడిన వారిలోనూ హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి.
యువతలో హృద్రోగాలు, గుండెపోటు ఘటనలకు ప్రధానంగా శారీరకంగా చురుకుగా లేకపోవడం, ఒత్తిడి, ఇన్సోమ్నియా, పొగతాగడం, మద్యం సేవించడం, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి రిస్క్ ఫ్యాక్టర్లు హృద్రోగ ముప్పు పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లతో హృద్రోగ ముప్పును నివారించవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు కనిక మల్హోత్రా చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.
అవకాడో, ఆలివ్ ఆయిల్, సాల్మన్ ఫిష్ వంటి ఆరోగ్యకర కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి వాపు ప్రక్రియను నివారిస్తాయి. అనారోగ్యకర కొవ్వులు, సోడియం, షుగర్ అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఆహారానికి దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేస్తూ సాల్ట్ బదులు మిరియాలు వంటి ఔషధ గుణాలు కలిగిన వాటిని రుచి కోసం వంటకాల్లో జోడించడం మేలు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు రోజూ తగినంతగా నీరు తాగాలి. కోఎంజైమ్, క్యూ10, రిస్వెరట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్స్ కలిగిన ఆహారం, సప్లిమెంట్లతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వీటిలో ఉండే న్యూరాస్యూటికల్స్, పోషకాలతో కడిన ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేకూర్చడంతో పాటు హృద్రోగ ముప్పును నివారిస్తుంది.
Read More :
ఈ నగరానికి ఎంత కష్టం..: ట్రాఫిక్ కడగండ్లతో బెంగళూర్ ఎకానమీకి రూ. 20,000 కోట్ల నష్టం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

