Diabetes controlling | దేశంలో మధుమేహం చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. మనల్ని పట్టి పీడిస్తున్న అనేక ప్రాణాంతక వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. వాస్తవానికి ఏటా ఎందరో ఈ చక్కెర వ్యాధికి బలవుతున్నారు. డయాబెటిస్‌కు రాజధానిగా మన దేశం మారిందంటే.. ఎంతలా ఈ వ్యాధి విస్తరిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ డయాబెటిక్ హోంగా ఇండియా మారడం కలవరపెట్టే అంశం.
మన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం కారణంగా చక్కెర వ్యాధి వ్యాపిస్తుంది. ఇది మనం తినే ఆహార పదార్థాల నుంచి చక్కెరల రూపంలో మారి శక్తిని అందిస్తుంది. ఇదే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీకి కారణమవుతుంది. ఈ వ్యాధి చాలా మటుకు జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్య. ఒకసారి ఈ వ్యాధికి గురయ్యారంటే ఇక జీవితాంతం చక్కెర శాతాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే.. లైఫ్ స్టైల్ తప్పక మారాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఫైబర్‌తో కూడిన ఆహారం చాలా అవసరం.
మధుమేహంతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి.
రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అన్నంకు బదులు రాగి పిండితో చేసిన దోసలను తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది.
తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు మేలు చేస్తాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారం.
బ్లాక్ గ్రామ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
అలోవెరాను క్రమం తప్పకుండా జ్యూస్‌లా తీసుకుంటే.. రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది.
హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం బరువు కంట్రోల్లో ఉండి బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.
రోజుకు సరిపడా నీళ్లు తాగడం వల్ల హైబ్లడ్ షుగర్ లెవల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరం పెట్టాలి.
నిత్యం వ్యాయామం చేయడం అలవాటుగా చేసుకోవాలి. వ్యాయామం శరీరంలోని గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడానికి సాయపడుతుంది.
శరీరం బరువు నియంత్రితంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఎక్స్ట్రా క్యాలరీలు అందకుండా చూడాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కూడా చక్కెర నియంత్రణలో ఉంటుంది.
బాగా నిద్ర పోయేలా చూసుకోవడం ద్వారా కూడా చక్కెర కంట్రోల్ అవుతుంది. నిద్ర లేమి ఇన్సులిన్ సెన్సిటివిటికి కారణమవుతుంది.
నూడుల్స్, పిజ్జా, ప్యాస్ట్రీలు, బర్గర్లు, చీజ్, స్వీట్లు, కేక్ లు, బ్రెడ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
స్కిన్ లెస్ చికెన్ ను మితంగా తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్ స్మోక్ చేయడం పూర్తిగా మానుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.