పెరుగు అచ్చమైన పాల ఉత్పత్తి. క్యాల్షియం, విటమిన్ బి – 2, విటమిన్ బి- 12, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎన్నో అత్యవసర పోషకాలు ఉంటాయి. సులువుగా అరిగిపోతుంది కూడా. కాబట్టి నిక్షేపంగా తినొచ్చు.
సజీవ బ్యాక్టీరియా సమృద్ధంగా ఉండే పెరుగు గొప్ప ప్రొబయోటిక్ ఆహారం. ఇది మంచి బ్యాక్టీరియా కావడంతో పేగుల పనితీరు మెరుగుపడటానికి, జీర్ణవ్యవస్థ చల్లబడటానికి, గడబిడగా ఉన్న కడుపును శాంతపరచడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. పెరుగులోని సజీవ బ్యాక్టీరియా వ్యాధికారక క్రిములతో సమర్థంగా పోరాడుతుంది.