Coriander Seeds Soaked Water | మనం రోజూ చేసే వంటల్లో అనేక రకాల పోపు దినుసులను ఉపయోగిస్తుంటాం. మన వంటింట్లో ఉండే అన్ని రకాల పోపు దినుసులు మనకు ఏదో ఒక రకంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుకనే పూర్వకాలం నుంచి మన పెద్దలు ఈ దినుసులను వాడడం మొదలు పెట్టారు. ఇక వీటిల్లో ధనియాలు కూడా ఒకటి. కొత్తిమీర మొక్క విత్తనాలనే ధనియాలు అని అంటారన్న సంగతి తెలిసిందే. కొత్తిమీర ఆకులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే ధనియాలను కూడా వంటల్లో వాడుతుంటారు. ఇవి చక్కని రుచి, వాసనను కలిగి ఉంటాయి. ఇవి వేస్తే కూరలకు చక్కని రుచి వస్తుంది. అయితే ధనియాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి పూట ధనియాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు.
ధనియాల నీళ్లను రోజూ పరగడుపునే తాగడం వల్ల శరీరానికి అవసరమైన నూనెలు లభిస్తాయి. దీంతో జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ధనియాలలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ధనియాలను నానబెట్టిన నీళ్లను తాగుతుంటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ధనియాల నీళ్లలో సహజసిద్ధమైన డైయురెటిక్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది. వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
ధనియాలను నానబెట్టిన నీళ్లను తాగుతుంటే చర్మంలో ఉండే టాక్సిన్లు బయటకు పోతాయి. చర్మం క్లియర్‌గా మారి కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ధనియాల నీళ్లను తాగడం వల్ల శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ధనియాల నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ధనియాల నీళ్లను తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ తగ్గిపోతాయి.
ధనియాల నీళ్లను తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ముఖ్యంగా శరీరంలో చేరే సీసం, పాదరసం వంటి లోహాలు బయటకు పోతాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా ధనియాల నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వృద్ధులు, గర్భిణీలు ఈ నీళ్లను సేవించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. లేదంటే విరేచనాల సమస్య వచ్చే చాన్స్ ఉంటుంది. అలాగే అలర్జీలు ఉన్నవారు కూడా ఈ నీళ్లను తాగకూడదు.