ధనియాలు సంప్రదాయ వైద్యంలో థైరాయిడ్ సమస్యలను నయం చేయడానికి ధనియాలను బాగా ఉపయోగిస్తారు. థైరాయిడ్ హార్మోన్ను క్రమబద్ధం చేయడంలో సాయపడే యాంటీ ఆక్సిడెంట్ గుణాలూ దీన్లో ఎక్కువే. చియా గింజలుఅత్యవసరమైన ప్రతీ పోషకాన్ని కలిగిన సూపర్ ఫుడ్ చియా గింజలు. ఇవి థైరాయిడ్ పనితీరుకు, ఇతర హార్మోన్ల సమతుల్యానికి అండగా నిలుస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్ఫ్ల మేషన్ను నివారిస్తాయి. హార్మోన్ల సమతూకాన్ని మెరుగుపరుస్తాయి.
సంప్రదాయ వైద్యంలో థైరాయిడ్ సమస్యలను నయం చేయడానికి ధనియాలను బాగా ఉపయోగిస్తారు. థైరాయిడ్ హార్మోన్ను క్రమబద్ధం చేయడంలో సాయపడే యాంటీ ఆక్సిడెంట్ గుణాలూ దీన్లో ఎక్కువే.
శరీరానికి అత్యవసరమైన ప్రతీ పోషకాన్ని కలిగిన సూపర్ ఫుడ్ చియా గింజలు. ఇవి థైరాయిడ్ పనితీరుకు, ఇతర హార్మోన్ల సమతుల్యానికి అండగా నిలుస్తాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఇన్ఫ్ల మేషన్ను నివారిస్తాయి. హార్మోన్ల సమతూకాన్ని మెరుగుపరుస్తాయి.
థైరాయిడ్ హార్మోన్ తయారీకి మూలంగా నిలిచే ప్రధానమైన ఖనిజాల్లో సెలీనియం ఒకటి. రోజువారీగా అవసరమైన సెలీనియంలో దాదాపు 18 శాతం వరకు తెల్ల నువ్వుల నుంచి లభిస్తుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి, థైరాయిడ్ సమస్యలతో పోరాటానికి తెల్ల నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వీటిలో ఐరన్, అయోడిన్ సమృద్ధిగా ఉంటాయి. హైపోథైరాయిడ్ నివారణలో ఉపకరిస్తాయి. మునగకాయలను తరచుగా తీసుకుంటే థైరాయిడ్ సమస్య అదుపులోకి వస్తుంది. అయితే, మేలైన ఫలితాల కోసం భోజనానికి ముందు మునగకాడలను ఉడికించాలని సూచిస్తారు పోషకాహార నిపుణులు.
వీటిలో విటమిన్-ఎ, రిబోఫ్లేవిన్, విటమిన్-బి6 లాంటి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. థైరాయిడ్ అసమతుల్యాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా విటమిన్-బి6 జీవక్రియలను ప్రేరేపిస్తుంది కాబట్టి, బెల్ పెప్పర్స్ హైపోథైరాయిడ్ ఉన్నవాళ్లకు చాలా మంచివి. అంతేకాదు, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ గ్రంథి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో దోహదపడతాయి.
ఇవి శక్తి వనరులు. సెలీనియం నిల్వలు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు. బ్రెజిల్ నట్స్ థైరాయిడ్ గ్రంథి పనితీరును క్రమబద్ధం చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ను.. అంటే శరీరం లోపలి వాపును, నొప్పిని తగ్గిస్తాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థకు అండగా నిలుస్తాయి.
ఇందులో పెక్టిన్ సమృద్ధిగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో ముడిపడి ఉన్న పాదరసం (మెర్క్యురీ)ను శరీరం నుంచి బయటికి పంపడంలో పెక్టిన్ సాయపడుతుంది. హైపోథైరాయిడిజం సమస్యను నివారించడంలో యాపిల్ ప్రయోజనకరంగా ఉంటుందని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.