Winter Period Issues | నెలసరి వచ్చిందంటేనే సాధారణంగా మహిళలు ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది చలికాంలో ఈ సమస్య ఓ సవాలుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం, తగ్గిపోయే సూర్యకాంతి.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. దాంతో కాల సంబంధ సమస్యలకు దారితీస్తుంది. చలికాలంలో పీరియడ్స్ సమస్యలను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని పాటించడం ద్వారా శీతాకాలంలో సమస్యలు లేకుండా పీరియడ్స్‌ను కొనసాగించవచ్చు.
ఇర్రెగులర్ పీరియడ్స్
శీతాకాలంలో పడిపోయే ఉష్ణోగ్రతలు, తగ్గిన సూర్యకాంతి.. మనలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. రుతు చక్రాన్ని నియంత్రించడంలో ఈ హార్మోన్ సహాయపడుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల చలికాలంలో పీరియడ్స్ ఇర్రెగులర్గా వస్తుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ముఖ్యంగా తగినంత నిద్ర కలిగి ఉండాలి. నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.
హెవీ పీరియడ్స్
చలికాలం వాతావరణం వాపు, రక్తం గడ్డకట్టడం పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. ఫలితంగా ఎక్కువ రోజుల పాటు పీరియడ్స్ ఉండేలా చేస్తుంది. దీనిని నివారించడానికి మీ ఆహారంలో ఆకు కూరలు, కొవ్వు చేపల వంటివి చేర్చుకోవాలి. అధిక చక్కెర, అధిక కొవ్వు పదార్ధాలను దూరం పెట్టాలి.
పీఎంఎస్ లక్షణాలు
చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల ఉబ్బరం, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ పీఎంఎస్ లక్షణాలను నివారించుకోవడానికి యోగా చేయడం లేదా మెడిటేషన్ పాటించడం వంటి రిలాక్సేషన్ టెక్నిక్లను మీ దినచర్యలో చేర్చుకోవాలి. తగినంత నిద్ర పొవడం చాలా ముఖ్యం.
డ్రై అండ్ డిస్కంఫర్ట్
చల్లటి గాలి, పొడిగాలి వంటివి పీరియడ్స్ సమయంలో యోని పొడిగా ఉంచి అసౌకర్యానికి దారితీస్తుంది. దీన్ని నివారించేందుకు ఇంట్లో తేమ లేకుండా చూసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. తేమను తగ్గించే లోదుస్తులు వాడాలి. అసౌకర్యాన్ని తగ్గించేందుకు శృంగారం సమయంలో టూబ్రికెంట్ను ఉపయోగించవచ్చు.
జలుబు-ఫ్లూ
చలికాలంలో జలుబు, ఫ్లూ జ్వరం సాధారణంగా కనిపిస్తాయి. వీటి వలన పీరియడ్స్ చాలా చికాకుగా ఉంటుంది. పలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అనారోగ్యాలను దూరం చేసుకునేందుకు తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
మొత్తమ్మీద చలికాలంలో పీరియడ్స్ సమస్యల నుంచి బయటపడేందుకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో తగినంత నిద్ర పొందడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఈ చలికాలపు రోజుల్లో మీ పీరియడ్స్ వీలైనంత సౌకర్యవంతంగా, సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు.