Fruits | మనం ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎంతో దోహదపడతాయి. కొన్ని రకాల పండ్లు సీజన్లలోనే లభిస్తాయి. ఇక కొన్ని పండ్లు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే ఏ పండు అయినా సరే మనకు వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఈ క్రమంలోనే భిన్న రకాల పండ్లు మనకు విభిన్నమైన లాభాలను అందిస్తాయి. అయితే మీకు తెలుసా.. పండ్లను భిన్న రకాల ఆహారాలతో కలిపి తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు, పండ్ల కాంబినేషన్ మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఏయే పండ్లతో ఏయే ఆహారాలను కలిపి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే యాపిల్ పండ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే చాలా మంది రోగాల బారిన పడినప్పుడు యాపిల్ పండ్లను తినమని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే యాపిల్ పండ్లను తినే వారు వాటిని ఏవైనా నట్స్‌తో కలిపి తింటే ఇంకా మేలు చేస్తాయి. నట్స్‌ను 8 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని యాపిల్స్‌తో కలిపి తినాలి. ఈ ఆహారాలను సాయంత్రం స్నాక్స్ సమయంలో తింటే ఎంతో మేలు చేస్తాయి. మనకు అధిక శక్తిని, పోషకాలను అందిస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ ఆహారాలను తినే ముందు ఒకసారి డాక్టర్ సలహా పాటిస్తే మంచిది.
ఇక పుచ్చకాయలను కూడా మనం ఇతర ఆహారాలతో కలిపి తింటే ఇంకా ఎక్కువ మేలు పొందవచ్చు. వేసవిలో మాత్రమే కాదు, మనకు పుచ్చకాయలు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభిస్తున్నాయి. కనుక పుచ్చకాయలను కూడా మనం కావాలనుకున్నప్పుడు తినవచ్చు. వీటిని రోజుకు ఒక కప్పు తింటే మంచిది. పుచ్చకాయలను పెరుగు లేదా నట్స్‌తో కలిపి తింటే మంచిది. ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే ద్రాక్ష పండ్లను చీజ్ వంటి ఆహారాలతో కలిపి తింటే మంచిది. దీంతో మనకు ఎక్కువ పోషణ లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటాం.
మామిడి పండ్లు మనకు వేసవి సీజన్లోనే లభిస్తాయి. అయితే వీటిని చియా సీడ్స్ లేదా నట్స్‌తో కలిపి తినాలి. దీంతో ఎక్కువ ఫలితం కలుగుతుంది. అలాగే పియర్స్ పండ్లను చికెన్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలతో కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీంతో అనేక పోషకాలను పొందవచ్చు. అదేవిధంగా దానిమ్మ పండ్లను అవకాడోలు లేదా వాల్ నట్స్‌తో కలిపి తింటే మేలు జరుగుతుంది. వాల్ నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దానిమ్మ పండ్లలో ఉండే విటమిన్ సి కూడా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.
మనకు ఈ సీజన్లో పైనాపిల్స్ అధికంగా లభిస్తాయి. ఇవి కూడా మనకు ఏడాది పొడవునా అందుబాటులోనే ఉంటాయి. అయితే ఈ పండ్లను చీజ్‌తో కలిపి తింటే మంచిది. దీంతో ఎక్కువ పోషణను పొందవచ్చు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అలాగే అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. వీటిని ఓట్మీల్ వంటి ఆహారంతో తింటే మంచిది. ఇలా పలు భిన్న రకాల పండ్లను భిన్న రకాల ఆహారాలతో కలిపి తింటే రెట్టింపు మొత్తంలో ప్రయోజనాలను పొందవచ్చు.