చలి వాతావరణం మనిషినే కాదు.. గుండెను కూడా గజగజా వణికిస్తుంది. ఎందుకంటే..ఈ సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో గుండెపోటు కేసులు 30 శాతం పెరుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం తేల్చింది. ఇక మనదేశంలోనూ.. శీతకాలంలో గుండెపోటు కేసులు 25 శాతం ఎక్కువగా సంభవిస్తాయని ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధన వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది గుండె సంబంధ సమస్యలతో మరణిస్తున్నారు. అందులోనూ, ఇతర కాలాలతో పోలిస్తే, చలికాలంలోనే ఎక్కువ హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయట. గతేడాది వారు నిర్వహించిన అధ్యయనం సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. చలికాలంలో గుండెపోటు మరణాలకు గల కారణాలను వివరిస్తున్నారు.