Heart Attack : చలికాలంలో శీతల గాలులు వణికిస్తుండటంతో ప్రజలు రాత్రి వేళల్లో ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక సహజంగా చలికాలంలో శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వెంటాడటంతో పాటు ఈ సీజన్లో గుండె పోటు కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. హృద్రోగాలతో బాధపడేవారికి చల్లటి వాతావరణం లక్షణాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మన శరీరంలో రక్త నాళాలు కుచించుకుపోతాయి. శరీరంలో ఉష్ణోగ్రత మెయింటైన్ చేసే క్రమంలో రక్తపోటు పెరగడంతో అది గుండెపై అదనపు ఒత్తిడిని ప్రేరేపిస్తుందని గురుగ్రాంకు చెందిన మ్యాక్స్ హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజత్ చివానె తెలిపారు.
ఈ సమయంలో గుండెకు రక్త సరఫరా తగ్గడంతో ఛాతీ నొప్పితో బాధపడే (యాంజినా)వారిలో లక్షణాలు తీవ్రమవుతాయని చెప్పారు. చలికాలంలో యాంజైనాతో బాదపడే వారు శారీరకంగా చురుకుగా ఉండలేరు. రక్తం మందంగా ఉంటూ గడ్డకట్టే అవకాశం ఉంటుందని ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీస్తుందని డాక్టర్ సంజత్ పేర్కొన్నారు. ధమనులు సంకోచించడంతో రక్త సరఫరా కోసం గుండె మరింత శ్రమించాల్సి ఉంటుందని, ఇది ధమనుల్లో వ్యర్ధాలు పేరుకుపోయి ఉన్న వారిలో మరింత ప్రమాదానికి దారితీస్తుందని అన్నారు. దీనికి తోడు చలికాలంలో మనుషుల ప్రవర్తనలో మార్పులు కూడా గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు.
చలికాలంలో శీతల గాలులను తట్టుకునేందుకు ప్రజలు ఇండ్లలోనే అధిక సమయం గడిపే క్రమంలో వారిలో శారీరక వ్యాయామం కొరవడుతుంది. శారీరకంగా చురుకుగా లేకపోవడంతో పాటు అధిక కొవ్వులతో కూడిన ఆహరం తీసుకోవడం, హాలిడేల్లో మద్యం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సీజన్లో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు నిండుగా దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు. మద్యాన్ని మితంగా తీసుకోవడం, అధిక వ్యాయామం జోలికి వెళ్లకుండా శారీరకంగా చురుకుగా ఉండేలా ప్రయత్నించడం మేలని చెబుతున్నారు,
Read More
Hydrabad | చట్నీ విషయంలో దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్య చేసుకున్న భార్య