న్యూఢిల్లీ : సుగంధ ద్రవ్యాలు వంటకాలకు రుచిని ఆపాదించడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను (Health Tips) అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతుంటారు. వంటింట్లో విరివిగా వాడే దాల్చినచెక్కతో జీర్ణ సంబంధ సమస్యలను చక్కదిద్దడంతో పాటు కడుపు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.
ఇది కొందరి దైనందిన జీవితాన్ని ఇబ్బందికరంగా మార్చి తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలను అతిగా తినడం, మద్యం ఎక్కువగా సేవించడం, అర్ధరాత్రి వేళ భోజనం చేయడం వట్టి కారణాలతో పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కడుపులో వేడిని తగ్గించడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయవచ్చని ఈ దిశగా దాల్చిన చెక్క దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు
. కడుపులో ఉష్ణంతో పాటు యాసిడ్ లెవెల్స్‌ను తగ్గిచడంలో దాల్చిన చెక్క మెరుగ్గా పనిచేస్తుంది. దాల్చిన చెక్క ఆరోగ్యంలో నిత్యం భాగం చేసుకోవడం ద్వారా శరీరంలో వాపు ప్రక్రియను నివారించడంతో పాటు జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు దాల్చిన చెక్క ప్రొ బయాటిక్‌గా పనిచేసి ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ ఔషధాలు కడుపులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహకరిస్తాయి.
Read More :
Ileana | పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?