ముంబై: ప్రముఖ నటి ఇలియానా (Ileana) తల్లి అయింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు (Baby boy) జన్మనిచ్చింది. అప్పుడే అతనికి పేరుకూడా పెట్టేసింది. ఈ మేరకు బాబు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను (Koa Pheonix Dolan) మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఆది సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. అభిమానులు, నెటిజన్లు ఇలియానాకు అభినందనలు తెలుపుతున్నారు.
తాను తల్లికాబోతున్నట్లు ఇలియానా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలను షేర్చేస్తూ వస్తున్నది. ఇక జూలైలో తన ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచినప్పటికీ.. ఆయన పేరును మాత్రం వెళ్లడించలేదు. ఇలియానా పెండ్లి కాకుండానే తల్లవడం గమనార్హం. దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఇల్లీబేబి.. 2018లో వచ్చిన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చివరిసారిగా తెలుగుతెరపై కనిపింది. ఇక బాలీవుడ్లో2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్‌బుల్‌లో కనిపించింది.