Cinnamon For Women | దాల్చిన చెక్కను మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. ఎక్కువగా మసాలా వంటలను చేసినప్పుడు దాల్చిన చెక్కను కూడా ఉపయోగిస్తుంటారు. దాల్చిన చెక్కను వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. దాల్చిన చెక్కను మనం ఎంతో కాలం నుంచే మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. అయితే ఆయుర్వేద ప్రకారం దాల్చిన చెక్క అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అయితే మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల స్త్రీలకు ఎంతగానో మేలు జరుగుతుందని అంటున్నారు. దాల్చిన చెక్క పొడిని రోజూ మీరు తినే ఆహారాలపై చల్లి తినవచ్చు. లేదా దాల్చిన చెక్క వేసి మరిగించిన నీళ్లను కూడా తాగవచ్చు. దీంతో స్త్రీలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రస్తుతం చాలా మంది మహిళలు పీరియడ్స్ సరిగ్గా రాక అవస్థలు పడుతున్నారు. అయితే దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దాల్చిన చెక్క నీళ్లను తాగుతుంటే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. గర్భాశయానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీవోఎస్) అనే సమస్యతో ప్రస్తుతం చాలా మంది స్త్రీలు బాధపడుతున్నారు. అలాంటి వారు దాల్చిన చెక్క నీళ్లను తాగితే చక్కని పరిష్కారం లభిస్తుంది. ఈ నీళ్లను సేవించడం వల్ల పీసీవోఎస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అండాశయంలో ఏర్పడే నీటి బుడగలు తొలగిపోతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు డయాబెటిస్ బారిన పడుతుంటారు. షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. అయితే డాక్టర్ సూచన మేరకు దాల్చిన చెక్క నీళ్లను తాగితే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే అతి మూత్ర వ్యాధి నుంచి కూడా బయట పడవచ్చు. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దాల్చిన చెక్కలో సినామాల్డిహైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
ప్రస్తుత తరుణంలో స్త్రీలకు సైతం గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. ఇందుకు కారణం కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. మహిళలు చాలా వరకు ఇంటి పట్టునే ఉంటారు. ఎలాంటి శారీరక శ్రమ ఉండదు. కనుక వారిలో కొవ్వు అధికంగా చేరుతుంది. దీంతో రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ చేరి అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. అయితే స్త్రీలు దాల్చిన చెక్క నీళ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీని వల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. ఇలా మహిళలకు దాల్చిన చెక్క నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కనుక రోజూ వాటిని తాగడం మరిచిపోకండి.