చూసేందుకు పాలకూరలా, రుచికి పుల్లగా ఉండే చుక్కకూర.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఈ ఆకుకూర.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చూసేందుకు పాలకూరలా, రుచికి పుల్లగా ఉండే చుక్కకూర.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఈ ఆకుకూర.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది.
చుక్కకూరలో ఫైబర్, పిండి పదార్థాలు ఎక్కువ. కాబట్టి, దీన్ని తీసుకుంటే.. జీర్ణ వ్యవస్థ
పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలనూ తగ్గిస్తుంది.
ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. చుక్కకూరను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల.. బరువు తగ్గాలనుకునే వారికి చుక్కకూర మంచి ఎంపిక.
చుక్కకూరలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
కంటిచూపును మెరుగుపరచడంలోనూ చుక్కకూర ముందు ఉంటుంది. అందుకే, రేచీకటితో బాధపడేవారు చుక్కకూరను క్రమం తప్పకుండా తినడం వల్ల.. సమస్య తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయని నేత్ర వైద్యులు కూడా చెబుతున్నారు.
చుక్కకూరలో ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి, రక్తహీనత ఉన్నవారు చుక్కకూరను తీసుకోవడం మంచిది. వారంలో రెండు, మూడుసార్లు చుక్కకూర తింటే.. రక్తహీనత నుంచి విముక్తి కలుగుతుంది.
క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టడంలోనూ చుక్కకూర దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళలను ఎక్కువగా పీడించే రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో చుక్కకూర ఉపయోగపడుతుంది. ఇందులోని సుగుణాలు.. రక్త నాళాల్లో పూడికలు లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటుతో బాధపడేవారు చుక్కకూరను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.