న్యూఢిల్లీ : ఈ ఏడాది దీపావళి (Diwali Party) హంగామా వెలుగు జిలుగులతో ముంగిళ్లలోకి వచ్చేసింది. మరో వారంలో దీపాల పండగ ఆగమనంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో దివాళీ పార్టీలకు అందరూ ప్లాన్ చేస్తున్నారు. మనకు పండగ అంటే ఆధ్యాత్మికతతో పాటు నోరూరించే దేశీ వంటకాలు కూడా గుర్తుకొస్తుంటాయి.
దివాళీ పార్టీల్లో ఆత్మీయ కలయికల సందర్భంగా అందరూ మెచ్చే స్నాక్స్ కోసం ట్రై చేస్తుంటారు. మగువలకు ఈ తరహా స్నాక్స్ ఏం చేయాలనే సందేహాలు వెంటాడుతుంటాయి. నలుగురూ కలిసి ఇష్టమైన రుచులను ఆస్వాదించే క్రమంలో క్రిస్పీ చికెన్ పాప్‌కార్న్ నుంచి చికెన్ సమోసాల వరకూ క్రేజీ స్నాక్స్ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటాయి.
వీటిని తయారుచేయడం కూడా సులభం కావడంతో పాటు అటు రుచి ఇటు శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉండే చికెన్ స్నాక్స్ వెరైటీలను ట్రై చేయవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ చికెన్ స్నాక్స్‌ను చిటికెలో తయారుచేసుకోవ్చని చెబుతున్నారు.
చికెన్ పాప్‌కార్న్
చికెన్ టిక్కా
చికెన్ సమోసా
చికెన్ మోమోస్
బేక్డ్ చికెన్ సీక్ కబాబ్స్
చిల్లీ చికెన్
చికెన్ నగెట్స్
Read More :