మనిషిని దీర్ఘకాలంపాటు పట్టి పీడించే వ్యాధుల్లో క్యాన్సర్ ప్రధానమైనది. క్యాన్సర్లలో పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ ఒకటి. అయితే, మనలో చాలామందికి కోలన్ క్యాన్సర్ ముప్పును పెంచే జీవనశైలి అలవాట్ల గురించి అంతగా తెలియదని ఓహియో స్టేట్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఊబకాయం, మద్యపానం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు పెద్దపేగు క్యాన్సర్కు దోహదపడతాయి.
కాబట్టి, దీనికి సంబంధించి అనుమానంగా అనిపించినా, డాక్టర్లు అవసరమని చెప్పినా.. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిదట. వీలైతే ఇంకా ముందే మేల్కోవాలని పరిశోధకులు సూచించారు.