న్యూఢిల్లీ: కణానికి పవర్‌హౌస్ మైటోకాండ్రియా అయితే, మన శరీరం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మెదడు. ఇతర యంత్రాల మాదిరిగానే, మెదడుకు కూడా నిరంతర సంరక్షణ అవసరం. మానవ శరీరంలోనే అతి ముఖ్యమైన అవయవం మెదడు. మెదడు పనితీరు బాగుంటేనే ఏదైనా చేయగలం. మరి మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన పోషకాలను తీసుకోవాలి. మెదడును చురుగ్గా మార్చడంలో ఆహారం కంటే మెరుగైన మార్గం మరొకటి లేదు. మన మూడు రకాల పోషకాలు తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
1.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్..
మెదడు పనితీరు, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడం, హృదయనాళ ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైన పోషకం. సాల్మన్ చేపలు, వాల్నట్స్, మాకేరెల్, మొలకెత్తిన విత్తనాలు, ప్లాంట్ ఆయిల్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుష్కలంగా ఉంటాయి.
2. ప్రోటీన్..
ఈ పోషకం కణాల పనితీరు, అభివృద్ధి, పెరుగుదలకు ముఖ్యమైనది. ప్రొటీన్ లోపం వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. కొన్ని ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ గుడ్లు, నట్స్, విత్తనాలు, లీన్ మాంసం, డైరీ మొదలైనవి.
3. యాంటీఆక్సిడెంట్లు..
చర్మ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా, లైకోపీన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొన్ని ఆహారాలు బెర్రీలు, సుగంధ ద్రవ్యాలు, గ్రీన్ టీ, కివీ, టమోటాలు మొదలైనవి.