పసుపు.. ప్రతి ఇంటి వంటింట్లో కనిపించే దినుసు. పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. దీని వాడకంతో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా ఎన్నో వ్యాధుల నుంచి మనం బయటపడొచ్చు. అందుకే నిత్యం చిన్న ముక్క అయినా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి. అందుకే దీన్ని ప్రతి వంటలో వేస్తుంటారు. మనం వంటల్లో ఎల్లో కలర్ పసుపునే వాడుతుంటాం. అయితే పసుపు, నలుపు రంగులో కూడా అల్లం దొరుకుతుంది. దీన్ని నల్ల పసుపు అని పిలిచినప్పటికీ.. నలుపు, నీలం రంగుల కలయికతో ఉంటుంది.