Health Tips : బరువు తగ్గాలనుకునే వారు రైస్ పక్కనపెట్టి రోటీలు తినడం సర్వసాధారణం. గోధుమ పిండితో చేసే రోటీలు, చపాతీలకు బదులు ఈ పిండిలో పోషకాలతో కూడిన పలు రకాల పొడులు, పిండి కలపడం ద్వారా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ పిండితో చేసే రెగ్యులర్ రోటీలను కొద్దిపాటి మార్పులతో రుచిగా, హెల్ధీగా తయారుచేసుకోవచ్చు.
గోధుమ పిండిలో పోషకాల గనిగా పేరొందిన మునగాకు పొడిని మిక్స్ చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కప్పు గోధుమ పిండిలో కేవలం ఒక స్పూన్ మునగాకు పొడి కలిపితే రోటీలు ఆకుపచ్చ వర్ణంలో పోషకాలతో నిండిఉంటాయి. మునగాకులో ఉండే విటమిన్ ఏ, పాలకూరలో కంటే మూడు రెట్లు అధికం. ఇందులో ఉండే అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్ క్లోరోజెనిక్ యాసిడ్ కారణంగా బరువు నియంత్రిస్తుంది.
మునగాకు పొడితో పాటు యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ పదార్ధాలు పుష్కలంగా ఉండే పసుపును వాడటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆటాలో ఒక కప్పు పిండికి స్పూన్ పసుపు కలిపితే రోటీలు బంగారు వర్ణంలో మెరుస్తూ అద్భుత రుచినీ అందిస్తాయి. ఆర్ధరైటిస్, జీర్ణ సమస్యలు, కుంగుబాటు, అలర్జీలకూ పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పప్పు, కర్రీస్‌కు కూడా పసుపు మంచి రుచిని అందిస్తుంది. ఇక రోటీలు టేస్ట్‌గా, ఆరోగ్య ప్రయోజనాలను అందించేలా ఉండాలంటే వీటిని మిక్స్ చేస్తే బెటర్..
మునగాకు పొడి
పసుపు
మెంతి పొడి
వాము
అవిసె గింజలు
Read More :
Delhi Rain | ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారి