న్యూఢిల్లీ : కలకండతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంటింటి ఔషధంగానూ కలకండను ఉపయోగిస్తుంటారు. రిఫైన్డ్ చక్కెరకు ఇది ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా పేరొందింది. శరీరంలో వాపు ప్రక్రియతో పోరాడే ఖనిజాలు, ఔషధ గుణాలు కలకండలో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడంతో పాటు వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది.
మనం తీసుకున్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. ఇక కలకండలో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఉండటంతో ఎముకలు బలంగా తయారవుతాయి. కలకండ నిత్యం తీసుకుంటే జలుబు, దగ్గు దరిచేరవు. ఇందులో షుగర్ కంటెంట్ అధికంగా ఉండటంతో తక్షణ శక్తిని అందిస్తుంది. నాడీవ్యవస్ధ, మెదడును ఉత్తేజితం చేయడంతో కలకండ తీసుకోవడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళన మటుమాయమవుతాయి.
అయితే పరిమిత మోతాదులోనే దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చక్కెర అధికంగా ఉండటం వల్ల కలకండ మోతాదు మించి తీసుకుంటే బరువు పెరగడం, మధుమేహం, హృద్రోగ ముప్పు పొంచిఉంటుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More