Veeramani Case: వీరమణి పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరం.. స్పెషల్ సిట్ ముందుకు ముగ్గురు మైనర్లు
Veeramani Case: జెమ్ గ్రానైట్స్ ఓనర్ ఆర్ వీరమణి పోక్సో కేసు(Veeramani Case)లో సిట్ బృందం దర్యాప్తు చేపడుతున్నది. అయితే మహిళా ఐపీఎస్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సిట్ ముందు కొత్తగా మరో ముగ్గురు అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో జెమ్ గ్రానైట్స్పై నమోదు అయిన ఫిర్యాదుల సంఖ్య 15కు చేరింది.
చెన్నై: జెమ్ గ్రానైట్స్ ఓనర్ ఆర్ వీరమణి లైంగిక దాడి ఆరోపణల కేసు(Veeramani Case)లో సిట్ బృందం దర్యాప్తు చేపడుతున్నది. అయితే మహిళా ఐపీఎస్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సిట్ ముందు కొత్తగా మరో ముగ్గురు అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో జెమ్ గ్రానైట్స్పై నమోదు అయిన ఫిర్యాదుల సంఖ్య 15కు చేరింది. మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపుల కేసు దర్యాప్తును మరింత విస్తృతం చేశారు. పోక్సో కేసులో వీరమణిని అరెస్టు చేసి ప్రస్తుతం చెన్నైలోని పుజల్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. ఇదే కేసులో శాంతి, మహేంద్ర సిమ్మన్ అనే మరో ఇద్దర్ని కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురిపై ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
ఏసీపీ పీసీ థెన్మోజీ, జాయింట్ కమీషనర్ దిషా మిట్టల్, ఎస్పీ ముత్తరాశీ, డిప్యూటీ కమీషనర్ గీతాంజలి సిట్లో సభ్యులిగా ఉన్నారు. మైనర్లతో వీరమణి ఉన్న వీడియోలను రికార్డు చేసి, ఆ తర్వాత కోట్లు వసూల్ చేసిన కేసులోనూ విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారి నుంచి సాక్ష్యాధారాలను, వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.
గతంలో ఈ కేసును పోలీసులు మూసివేయాలనుకున్నారు. అయితే కేసును క్లోజ్ చేయాలన్న రిపోర్టును పోక్సో కోర్టు తిప్పికొట్టింది. ఓ వీడియోలో ఉన్న అమ్మాయి నుంచి జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం రికార్డు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

