Butter Milk | మజ్జిగ అందరికీ సుపరిచితమే. లంచ్ అయ్యాక చాలా మంది తప్పనిసరిగా ఒక గ్లాస్ మజ్జిగ తాగుతారు. శరీరానికి చలువ చేసే పదార్థాల్లో మజ్జిగక కూడా ఒకటి. అంతే కాదు.. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర బరువు తగ్గేందుకు కూడా మజ్జిగ ఉపయోగపడుతుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఎంతో సహాయపడుతుంది. అలా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది మజ్జిగ. ఇన్ని ఉపయోగాలున్నా మజ్జిగ ప్రతి రోజు తాగొచ్చా..? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..! అని అనుమానం రావొచ్చు. కానీ పల్చగా ఉండే మజ్జిగా ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దరి చేరవు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.